రైతు బజార్ లో అధికారుల పరిశీలిన
జగిత్యాల, అర్జున్ సమాచారం ప్రతినిధి జూలై 27.
జగిత్యాల పటణంలోని రైతు బజార్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం, మున్సిపల్ కౌన్సిలర్ అరవ లక్ష్మి సంయుక్తంగా రైతు బజార్ను పరిశీలించారు.
ఈ సందర్భంగా రైతు బజార్ వెలుపల రహదారిపై కూర్చొని కూరగాయలు విక్రయిస్తున్న రైతులతో అధికారులు మాట్లాడారు. అనంతరం వారిని రైతు బజార్ లోపలికి వెళ్లి విక్రయాలు నిర్వహించాలని సూచించి, లోపలికి పంపించారు. రైతు బజార్లో ఉన్న హోల్సేల్ వ్యాపారులతో అధికారులు చర్చించారు. హోల్సేల్ వ్యాపారులు ఒక వైపు మాత్రమే వ్యాపారం నిర్వహించేలా, రైతులకు ప్రత్యేకంగా స్థలం కల్పించి వారు రైతు బజార్ లోపలే విక్రయాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రజలకు కూడా అసౌకర్యం లేకుండా రైతు బజార్లో క్రమబద్ధమైన ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ అధికారులకు ఆదేశించారు. రైతులు కూడా రహదారులపై కాకుండా రైతు బజార్ లోపలే విక్రయాలు నిర్వహించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిశీలనలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీనివాస్, టీపీబీఓ శ్రీకర్, శానిటరీ ఇన్స్పెక్టర్ చందు, రాజేష్, రవి, అరుణ్, రమేష్, అశోక్, లక్ష్మీనారాయణ, విష్ణు, వివేక్ తదితర మున్సిపల్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.